: మిస్ ఇండియా పోటీల్లో.. మెరిసిన గోదావరి ఖని అమ్మాయి!


మిస్ ఇండియా పోటీల్లో దక్షిణ భారతదేశం నుంచి పాల్గొన్న గోదావరి ఖని ఎన్టీపీసీకి చెందిన రశ్మీ నాల్గో దశ వరకు చేరింది. మణప్పురం గోల్డ్ లోన్ ఆధ్వర్యంలో ఈ మిస్ ఇండియా పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీపీసీ టౌన్ షిప్ లో వ్యాపారి అయిన భగత్ సింగ్, ప్రసన్నలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె అయిన రశ్మీ.. హైదరాబాదులో ఫ్యాషన్ డిజైనింగ్ విభాగంలో డిప్లొమో పూర్తి చేశారు. ప్రస్తుతం కోయంబత్తూరులో ఈ నెల 18వ తేదీన దక్షిణ భారత స్థాయిలో ఫైనల్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఇందులో విజేతలైన మొదటి ముగ్గురికి మిస్ ఇండియా పోటీల్లో నేరుగా పాల్గొనే అవకాశం వరిస్తుంది. ఎంపికలో నిర్వహిస్తున్న అంశాలతో పాటు ఓటింగ్ విధానం కూడా పోటీలో ఉందని, విద్యార్థులు, యువకులు మొబైల్, ఇంటర్నెట్ ద్వారా రశ్మీకి ఓటింగ్ చేయాలని ఆమె కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News