: కాంగ్రెస్ మాత్రమే సుస్థిర పాలన అందిస్తుంది : రాహుల్
కాంగ్రెస్ పార్టీ మాత్రమే సుస్థిర పాలన అందిస్తుందని ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ కున్న అధికారాలను ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా కాంగ్రెస్ పేద, అణగారిన ప్రజలకు అండగా నిలబడిందని రాహుల్ చెప్పారు. నగదు బదిలీ పథకాన్ని అమలుచేసి సంక్షేమ ఫలాలు నేరుగా లబ్దిదారులకు అందించామని ఆయన తెలిపారు. పంచాయితీ రాజ్ వ్యవస్థను తన తండ్రి రాజీవ్ గాంధీ బలోపేతం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ విద్వేష రాజకీయాలను ప్రోత్సహించదని, కాంగ్రెస్ పార్టీలో యువకులకు స్థానం కల్గించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యతనిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు.