: ఏఐసీసీ వార్తల కోసం మొబైల్ ఎస్ఎంఎస్


మరో మూడు నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కాంగ్రెస్ మొబైల్ ఎస్ఎంఎస్ లాంచ్ చేసింది. దీని ద్వారా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 1800 208 2020 నంబర్ కు మిస్ కాల్ ఇస్తే ఏఐసీసీ నుంచి తాజా సందేశాన్ని పొందవచ్చని చెప్పారు.

  • Loading...

More Telugu News