: హోం మంత్రికి కేజ్రీవాల్ ఫిర్యాదు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర పోలీసులపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కు సాయంత్రం ఫిర్యాదు చేయనున్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలు కాపాడడంలో పోలీసులు సహకరించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తాజాగా డెన్మార్క్ యువతిపై జరిగిన అత్యాచారంతో ఆయన ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి ఢిల్లీ శాంతిభద్రతలను తమకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ శాంతిభద్రతలు కేంద్ర హోం శాఖ ఆధీనంలో ఉన్నాయి.