: 'ఫోర్బ్స్' ప్రభావవంతుల సెలబ్రిటీల జాబితాలో స్పిల్ బర్గ్


అమెరికాలోని ప్రభావవంతుల సెలబ్రిటీల జాబితాలో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు 'ఫోర్బ్స్' పత్రిక వెల్లడించింది. పత్రిక వార్షిక అధ్యయనంలో ఈ విషయాన్ని తెలిపింది. ఇటీవల ఆయన రూపొందించిన 'లింకన్' చిత్రం 12 ఆస్కార్ నామినేషన్లకు ఎంపిక కావడం, ప్రపంచ వ్యాప్తంగా 275 మిలియన్ డాలర్లు, విదేశీ మార్కెట్ ద్వారా 93 మిలియన్ డాలర్లను వసూలు చేయడంతో స్పిల్ బర్గ్ పాప్యులారిటీ మరింత పెరిగిందని పత్రిక పేర్కొంది. దాంతో, 47 శాతం మంది ఆయనకు పట్టం కట్టారని వివరించింది. ఇక గతేడాది తొలి స్థానంలో ఉన్న ఓఫ్రా విన్ఫ్రే ఈ ఏడాది 45 శాతం ఓటింగ్ తో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News