: మహిళా బాక్సర్ పై దాడి కేసులో బాక్సర్ డింకో అరెస్ట్
ప్రముఖ బాక్సర్, ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ డింకో సింగ్ ను మణిపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న ఇంపాల్ లోని లంపాక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఓ మహిళా వెయిట్ లిఫ్టర్ ను డింకో సింగ్ వేధించాడు. అతని కారుపై డింకో అని రాసినందుకు కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనపై సదరు మహిళా బాక్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 1998 ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించడంతో డింకో పేరు మార్మోగిపోయింది. అతన్ని భారత ప్రభుత్వం అర్జున, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. అలాంటి డింకో ఇలాంటి పని ఎలా చేశాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కూడా డింకో చర్యలను తీవ్రంగా ఖండించింది. డింకోపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆ మహిళా బాక్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.