: కారు లోను కావాలంటే.. మరింత కూడబెట్టాల్సిందే..!


కారు లోను కావాలా.. అంటూ అడిగి మరీ అప్పులిచ్చిన బ్యాంకులు ఇప్పడు నిబంధనలను కఠినతరం చేసేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఏడాదికి ఆరు లక్షల రూపాయల ఆదాయముంటేనే కారు లోన్ మంజూరు చేయనున్నట్టు స్టేట్ బ్యాంక్ తెలిపింది. ఇంతకు ముందు ఏడాదికి 2.5 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారికి వాహన రుణం ఇచ్చేవారు. ఇప్పుడు వార్షిక ఆదాయ పరిధిని ఏకంగా ఆరు లక్షల రూపాయలకు పెంచేశారు. స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రం కొంత వెసులుబాటు కల్పించారు. ఎస్బీఐ ఖాతాదారులకు 4.5 లక్షల వార్షిక ఆదాయం ఉంటే వాహన రుణం ఇస్తామంటూ బ్యాంక్ తాజా నిబంధనల్లో పేర్కొంది. ఇప్పుడు ఎస్బీఐ వాహన రుణాలపై 10.45 శాతం వడ్డీరేటును వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News