: ఆనం.. మరోసారి నోరు జారితే ఊరుకోం: వైకాపా


రెవెన్యూ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అమర్ నాథ్ రెడ్డి, బాబురావు, శ్రీనివాసులు విరుచుకుపడ్డారు. దివంగత నేత రాజశేఖరరెడ్డిపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని... నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. వైయస్ పుణ్యం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాననే విషయాన్ని మంత్రి మరచిపోరాదని సూచించారు. ఈ రోజు వీరు అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. టీడీపీ నేత పయ్యావులకు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు. విభజనపై మీ పార్టీ విధానమేమిటో మీ నేత చంద్రబాబును అడగాలని సూచించారు.

  • Loading...

More Telugu News