: ఏఐసీసీ సదస్సులో పీవీ నరసింహారావుకి సముచిత గౌరవం!


భారతదేశం గర్వించదగ్గ మేధావి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు ఎట్టకేలకు ఏఐసీసీ సదస్సులో సమున్నతమైన గౌరవం లభించింది. సమావేశాల్లో పీవీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఐదేళ్ల పాటు భారత ప్రధానిగా పనిచేసి, దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన పీవీని, ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పట్టించుకోలేదు. ఢిల్లీలో ఘాట్ కూడా ఏర్పాటు చేయని తొలి ప్రధానిగా కూడా పీవీ నిలిచారు. పీవీకి జరిగిన అవమానం తెలుగువారందర్నీ ఎంతో బాధించగా, దేశవ్యాప్తంగా అనేక మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే, ఇన్నేళ్ల తర్వాత ఆ మహనీయుడిని కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో గౌరవించింది. ఆయన చిత్రపటాన్ని సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News