: తెలంగాణలో ఒక్క అవినీతిపరుడు కూడా లేడు: రేవంత్ రెడ్డి
శాసనసభలో టీబిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు, మంత్రి శైలజానాథ్ ప్రసంగానికి టీడీపీ నేత రేవంత్ రెడ్డి అడ్డుతగిలారు. రాజకీయ పదవుల కోసమే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందన్న శైలజానాథ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిలో ఒక్క తెలంగాణవారైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. వేలాది కోట్ల కుంభకోణాలకు పాల్పడిన వారంతా సీమాంధ్రులేనని అన్నారు. స్వేచ్చా వాయువుల గురించి మాట్లాడే శైలజానాథ్ పులివెందులలో ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు టీఆర్ఎస్ నేత కేటీఆర్ చెప్పారు.