: శాసనసభ రేపటికి వాయిదా
శాసనసభ రేపటికి వాయిదా పడింది. మంత్రి శైలజానాథ్ సుదీర్ఘ ప్రసంగం అనంతరం అతన్ని ముగించాలని డిప్యూటీ స్పీకర్ కోరారు. సమయాభావం అని భావిస్తే తాను రేపు మాట్లాడుతానని.. సభ ముందుకు తేవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని మంత్రి శైలజానాథ్ కోరారు. ఇంతలో సభను వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ తెలిపారు. దీంతో శాసనసభ రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది.