: బిల్లుపై ఓటింగ్ అంటే ఎందుకు భయం?: శైలజానాథ్


భారత రాజ్యాంగం ముందు కొత్త సమస్యను తెచ్చిపెట్టే ఈ విభజన బిల్లుపై ఓటింగ్ అంటే తెలంగాణ ప్రాంత నేతలు ఎందుకు భయపడుతున్నారని శైలజానాథ్ ప్రశ్నించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, 'చేతనైతే ఓటింగ్ కు అందరూ సహకరించండి, అందరి రంగులూ బయటపడతాయి. దానిపై ఎందుకు భయపడుతున్నారు?' అంటూ నిలదీశారు. దేనికోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని ఆయన తెలిపారు.

హైదరాబాద్ నగరం కొల్లగొట్టబడి, దోచుకోబడి ప్రపంచ పటంలో స్థానం సంపాదించుకుందా? అని ఆయన అడిగారు. 20 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో రహదారుల పరిస్థితులు ఏంటో అందరికీ తెలుసని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లోకి 5,500 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని ఆయన అన్నారు. ఏ లెక్కలు తీసుకున్నా, విద్య, వైద్యం, పరిశ్రమలు అన్నీ తెలంగాణలోనే ఎక్కువ ఉన్నాయన్న విషయం తెలుస్తుందని ఆయన తెలిపారు. నిజాలు మాట్లాడనివ్వండి, ప్రజలు తెలుసుకుంటున్నారని ఆయన సహచరుల్ని కోరారు.

  • Loading...

More Telugu News