: స్వాతంత్ర్యోద్యమంతో పాటు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వాదం పెరిగింది: శైలజానాథ్
స్వాతంత్ర్యోద్యమంతో పాటు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వాదం కూడా పెరిగిందని, దాని ప్రకారమే రాష్ట్రాలు ఏర్పడ్డాయని మంత్రి శైలజానాథ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, 'రాజ్యాంగబద్ధంగా అన్ని రాష్ట్రాలు ఒకలా ఏర్పాటయితే, కేవలం మన రాష్ట్రం మాత్రం మరోలా ఏర్పడాలా? ఏంటా వ్యత్యాసం?' అని సూటిగా ప్రశ్నించారు. దేశంలో గతంలో అనుసరించిన విధానాలే ఇక్కడా అమలు కావాలి కానీ... మనకెందుకీ తేడా? అని అన్నారు. శాసనసభల సిఫారసులతో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మనం కూడా భారతీయులమే కదా, మనకెందుకు విధానోల్లంఘన? అని నిలదీశారు. విభజిస్తాం, ముక్కలు చేస్తాం అంటూ రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మనమే ఎందుకిలా తయారయ్యామని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.