: చేతనైతే నిజాలు చెప్పండి.. అబద్ధాలతో ఉద్యమాన్ని నడిపించారు: శైలజానాథ్
నిజాం సంస్థానం కూలిపోయేనాటికి ఇక్కడ ఉన్న వనరులు, వసతుల వివరాలు చేతనైతే వెల్లడించండి.. అంతే కానీ తప్పుడు సమాచారంతో విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాన్ని నడపకండని మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత నేతలు చేసిన ఆరోపణలపై తాము నిజాలు వెల్లడించడం మొదలుపెట్టిన తరువాతే ఆత్మాభిమానం, స్వయం పాలన అంటున్నారని అన్నారు. విద్యాసంస్థలు, ఉద్యోగాలు, ఆర్థిక ఎదుగుదల అన్నీ తెలంగాణలోనే ఎక్కువ అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న నేతలలాంటి నేతలు అప్పట్లో లేరు కనుక, వారంతా ప్రజల శ్రేయస్సును కోరుకున్నవారు కనుకే అప్పట్లో నేతలంతా సమైక్యమన్నారని ఆయన గుర్తు చేశారు. కుహానా వాదాలతో ప్రజల్లో తప్పుడు భావజాలాన్ని తీసుకెళ్లలేరని ఆయన విమర్శించారు.