: మెజారిటీ సభ్యుల అభిప్రాయమే శాసనసభ అభిప్రాయం: అశోక్ గజపతిరాజు
శాసనసభ అభిప్రాయమంటే సభలోని మెజారిటీ సభ్యుల అభిప్రాయమేనని అందరూ గుర్తించాలని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, సభలో సభ్యులు చర్చించడం లేదంటూ మంత్రులే బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నప్పుడు మిగతావారు వారి సమయం వచ్చేంతవరకు ఎదురు చూడాలని, అప్పుడు వారి వాదన వినిపించాలని ఆయన సూచించారు. చర్చ జరగాలి తప్ప వాదోపవాదాలు కాదని సభ్యులు గుర్తించాలని ఆయన కోరారు. ఎవరి అభిప్రాయం వారు చెప్పే స్వేచ్చ వారికి ఉందని ఆయన గుర్తు చేశారు.