: ఆందోళన బాటలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు
రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కార్మిక ఐక్య సంఘాల వారు ఇవాళ (శుక్రవారం) హైదరాబాదులో తమ కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా 20వ తేదీ, సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నామని వారు చెప్పారు. 25వ తేదీన హైదరాబాదులోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నారు. తమ డిమాండ్లను ఆమోదించకపోతే.. ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత నిరవధిక సమ్మె చేస్తామని వారు వెల్లడించారు.