: సీమాంధ్ర ఎంపీలకు ఎట్టకేలకు అందిన ఆహ్వానం


తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు ఏఐసీసీ సమావేశాలకు ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆహ్వానం పంపింది. దాంతో వారిలో లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ సమావేశాలకు హాజరయ్యారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, హర్షకుమార్, సాయిప్రతాప్, సబ్బం హరిలకు పాసులు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ అధిష్ఠానం వెనక్కి తగ్గింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News