: భారతీయ అమెరికన్ల సేవలను తెలిపే మ్యూజియం
ఎన్నో మ్యూజియంలను చూశాం. కానీ దీని ప్రత్యేకత వేరు. అమెరికాలో భారత సంతతికి చెందిన వారి సేవలను తెలియజేసే మ్యూజియం ఇది. వాషింగ్టన్ లోని స్మిత్ సోనియన్ ఇనిస్టిట్యూట్స్ నేషనల్ మ్యూజియంలో ప్రత్యేక కేంద్రం ఫిబ్రవరి 27న ప్రారంభం కానుంది. భారత్ నుంచి గత 300ఏళ్ల కాలంలో అమెరికాకు వలసవచ్చిన వారి చరిత్ర, వారిలో అమెరికన్ సమాజ అభివృద్ధికి చేసిన విశేష సేవల గురించి ఈ మ్యూజియం తెలియజేస్తుందని.. స్మిత్ సోనియన్ ఆసియన్ పసిఫిక్ అమెరికన్ సెంటర్ డైరెక్టర్ కోన్రాడ్ తెలిపారు.