: బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా: శైలజానాథ్


అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభజన బిల్లును కేంద్రం టేబుల్ ఐటెంగా తీసుకురావడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మంత్రి శైలజానాథ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధిని మరచి విభజన స్పూర్తిని త్యజించిన బిల్లును వ్యతిరేకిస్తున్నానని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల స్ఫూర్తికి విరుద్ధంగా తయారైన బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. తెలుగు జాతికోసం విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నానని అన్నారు. భారత ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా తయారైన బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఆధిపత్య ధోరణికి అనుకూలంగా మారుతున్న ఈ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా ఉన్న తెలంగాణ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని శైలజానాథ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News