: ప్రాంతాలవారీగానే ప్రజలు ఆలోచిస్తున్నారు: ముఖ్యమంత్రి
తమ పార్టీ నేతలు ప్రాంతాల వారీగానే అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎందుకంటే, పార్టీలని బట్టి ప్రజలు ఆలోచించటంలేదని శాసనసభలో పేర్కొన్నారు. కాబట్టి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడక తప్పదని సీఎం చెప్పారు. అయితే, రాష్ట్ర సమైక్యతపై సీపీఎం తన వైఖరి మార్చుకోలేదని, మొదటి నుంచి చెప్పిందే ఇప్పుడు చెబుతున్నారని అందుకు వారిని ప్రశంసిస్తున్నట్లు కిరణ్ చెప్పారు.