: ఒక్క ఓటుకు కోటిన్నర ఇస్తా!


ఓటుకు వెయ్యి, రెండువేల రూపాయలు ఇవ్వడం విన్నాం కానీ, కోటిన్నర ఏంటా అనుకుంటున్నారా? కానీ, ఇది సాధారణ ఎన్నికల్లో ఓటు కాదు. పెద్దల సభ రాజ్యసభలో గెలుపుకోసం విలువైన ఎమ్మెల్యే ఓటుకు ఒక పారిశ్రామిక వేత్త ఇవ్వజూపిన మొత్తం. త్వరలో రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇప్పుడున్న రాజకీయ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని రాజ్యసభలో అడుగుపెట్టాలని నెల్లూరు పారిశ్రామికవేత్త ఒకరు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఒక మాజీ మంత్రి గారు నిన్న సీఎల్పీ సమావేశంలో వెల్లడించారు. కానీ, తన పేరును మాత్రం రాయవద్దని ఆయన కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు సక్రమంగా లేనందున రాజ్యసభ ఎన్నికల్లో ఏ పార్టీ వారు ఆ పార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తారన్న నమ్మకం లేదని... కనుక తనకు ఓటేస్తే కోటిన్నర వరకు ఇస్తానని ఆ పారిశ్రామికవేత్త చెప్పినట్లు మాజీ మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News