: నాకు రాజకీయాలొద్దు: గంగూలీ


రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేస్తాడన్న వార్తలకు టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ తెరదించాడు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. "నేను రాజకీయవేత్తను కాను. ఆటగాడిని మాత్రమే" అని తేల్చిచెప్పాడు. ఈ వివరాలను కోల్ కతా లో తెలిపాడు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలని బీజేపీ నుంచి గత నెల గంగూలీకి ఓపెన్ ఆఫర్ వచ్చింది. దీనికి తోడు నవంబర్ లో వరుణ్ గాంధీతో గంగూలీ భేటీ అయ్యాడు. దీంతో, రాజకీయాల్లో గంగూలీ కీలకపాత్ర పోషించబోతున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి.

  • Loading...

More Telugu News