: ఫిబ్రవరి మొదటి వారంలోగా తెలంగాణ ఏర్పాటు చేయాలి: రావుల చంద్రశేఖర్


ఫిబ్రవరి మొదటి వారంలోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుతో పని చేసిన అధికారులు ఆర్బీఐ గవర్నర్ గా ఎదిగారని చెప్పారు. 10 ఛార్జిషీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తికి బెయిలు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేవలం కుమ్మక్కు రాజకీయాలవల్లే జగన్ కు బెయిలు మంజూరైందని ఆరోపించారు.

తెలంగాణ వారి ఆస్తులను కొల్లగొట్టిన వారే సమైక్యాంధ్ర అంటున్నారని సమైక్యవాదులను చులకన చేశారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఉనికిని కాపాడుకునేందుకే జగన్ తో చేతులు కలిపిందని ఆయన మండిపడ్డారు. మ్యాచ్ అయిపోయిందని, ఇక ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టవద్దని రావుల సూచించారు. బిల్లుపై చర్చకు గడువు పెంచడం వల్ల పలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దని రావుల కోరారు.

  • Loading...

More Telugu News