: మూడోరోజు ఆటలో 9వ వికెట్ కోల్పోయిన ఆసీస్
273 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మొహాలీ టెస్ట్ లో మూడోరోజు ఆట ప్రారంభించిన ఆసీస్ ఆటగాళ్లు ఓ వైపు వికెట్లను కాపాడుకుంటూనే, తమ పరుగుల జోరు సాగిస్తున్నారు. స్మిత్ 92 పరుగులు చేసి ఓజా బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా, స్టార్క్ 99 పరుగులు చేసి శర్మ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 9 వికెట్లకు 408 పరుగులతో ఆట కొనసాగిస్తోంది. భారత్ తో జరుగుతున్న టెస్ట్ సీరిస్ లో మొదటి రెండు మ్యాచ్ లు కోల్పోయి 0-2 స్కోరుతో వెనుకబడ్డ ఆస్ట్రేలియా జట్టు మూడోదైన మొహాలీ టెస్ట్ లో ఎలాగైనా గెలిచి పరువునిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.