: అమ్మ వార్నింగ్ ఇచ్చింది..: బిపాషాబసు
బిపాషాబసు అమ్మ చెప్పిన మాట వినాలని నిర్ణయించుకుందట. ఏ విషయంలో? పెళ్లి చేసుకునే విషయంలో! హర్మాన్ బవేజాతో డేటింగ్ చేస్తున్న బిపాషా అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు ఇరువైపుల కుటుంబాల సమ్మతి కూడా లభించింది. అయితే, బెంగాలీ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటేనే తమ పెళ్లికి అమ్మ వస్తుందని బిపాషా తెలిపింది. ఇదే విషయమై ఆమె వార్నింగ్ ఇచ్చిందని.. కనుక తాను బెంగాలీ సంప్రదాయంలోనే పెళ్లాడతానని స్పష్టం చేసింది. ఫిట్ నెస్ సూత్రాలతో తాజా సీడీని విడుదల చేసిన సందర్భంగా బిపాషా ముంబైలో మీడియాతో మాట్లాడింది. తన పెళ్లిలో ఎవరూ డ్యాన్స్ చేయకూడదని.. కేవలం ఎక్సర్ సైజ్ మాత్రమే చేయాలని కోరింది.