: ప్రియుడితో వెళ్లి.. కట్టుకథ అల్లి


వయసు 15 ఏళ్లే. కానీ, మహా చాకు! అంత చిన్న వయసులోనే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఆ బాలిక ప్రియుడితో కలిసి ఎక్కడికో వెళ్లి వచ్చింది. ఇంట్లో వాళ్లు కోప్పడ్డారు. దాంతో ఒక స్టోరీ చెప్పింది. ఈ నెల 14న ఒక వ్యాన్ డ్రైవర్ తనను అపహరించాడని, అతడు, అతడి ఇద్దరు సహచరులు కలిసి తనపై అత్యాచారం చేశారని చెప్పింది. పోలీసులు రంగంలోకి దిగారు. విచారిస్తే.. ఒకసారి చెప్పిన మాటలకు, మరోసారి చెప్పిన మాటలకు పొంతన కుదరట్లేదు. బాలికను తమదైన శైలిలో ప్రశ్నించగా.. ఆ పదో తరగతి బాలిక అసలు విషయాన్ని బయటపెట్టింది. బోయ్ ఫ్రెండ్ ధర్మేంద్ర పరిహార్(25) తో కలిసి బయటకు వెళ్లానని కుటుంబ సభ్యలు తనపై కోపంతో ఉన్నారని, అందుకే ఈ స్టోరీ చెప్పానని వెల్లడించింది. దాంతో పోలీసులు ధర్మేంద్ర పరిహార్ పై అపహరణ కేసు పెట్టి అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News