: తెలంగాణ యువకుల కోసం ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ
నిరుద్యోగ యువకుల కోసం నేటి నుంచి ఈ నెల 25 వరకు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగుతుంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఇది జరగనుంది. తెలంగాణలోని పది జిల్లాలవారు ఇందులో పాల్గొనడానికి అర్హులని ఖమ్మం కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ తెలిపారు. వయసు, విద్యార్హతలు, నేటివిటీ సర్టిఫికెట్లతో ర్యాలీకి హాజరు కావాలని సూచించారు.