: ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను ఆహ్వానిద్దామా?: అధిష్ఠానం పునరాలోచన
ఢిల్లీలో ఈ రోజు జరగనున్న ఏఐసీసీ సదస్సుకు ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు పాసులను నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీడియాలో రచ్చరచ్చ అయ్యేసరికి అధిష్ఠానం పునరాలోచనలో పడింది. ఆహ్వానాలు నిరాకరించిన ఆరుగురు ఎంపీలకు పాసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఆరుగురు ఎంపీలు కూడా గుర్రుగా ఉన్నారు. తమకు పాసులు జారీచేయకపోవడం అనేది తమ హక్కులను కాలరాయడమేనని వారంటున్నారు. ఒకవేళ తమకు పిలుపు రాకపోతే, సదస్సు ప్రాంగణంలో ధర్నా చేపట్టడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు.