: కొనసాగుతున్న సీడబ్ల్యుసీ సమావేశం
ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం గంటన్నర నుంచి కొనసాగుతోంది. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీని పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని సమావేశానికి హాజరైన నేతలు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సంజీవరెడ్డి, సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు.