: భక్తులపై కేసులు ఉపసంహరించుకొన్న టీటీడీ


ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల చర్యలపై ఆందోళనకు దిగిన భక్తులపై టీటీడీ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో హిందూ ధార్మిక సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో టీటీడీ వెనక్కి తగ్గింది. భక్తులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటున్నట్టు ఇవాళ (గురువారం) సాయంత్రం ప్రకటించింది. ఇక, మున్ముందు కూడా ఇలాంటి ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ డిప్యూటీ ఈవో రమణ పేర్కొన్నారు.

పర్వదినమైన వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనార్థం వచ్చిన సామాన్య భక్తులను పట్టించుకోకపోవడంతో టీటీడీపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తోడు వీఐపీ భక్తులకు రెడ్ కార్పెట్ పరచడంతో వారి కోపం కట్టలు తెంచుకుంది. భక్తులపై కాదు.. టీటీడీ ఛైర్మన్, ఈవోపై కేసు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. తిరుమల కొండ అనే బదులు వీఐపీ కొండ అనే పేరు మార్చాలంటూ వారు మండిపడ్డారు. ఏకాదశి రోజున ఏకంగా.. ఎనిమిది వేల వీఐపీ పాసులు ఇచ్చారని, ఒక్క ఛైర్మన్ పేరు మీద 900కు పైగానే పాసులు జారీ చేశారని వారు విమర్శించారు. అయితే.. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు రావడంతో టీటీడీ చివరకు దిగివచ్చి భక్తులపై పెట్టిన కేసులను ఎత్తివేసింది.

  • Loading...

More Telugu News