: ముఖ్యమంత్రి అవుతానేమోననే నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు: కేంద్రమంత్రి సర్వే
టీబిల్లుపై చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు సరిపోతుందని... గడువు పొడిగించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. గడువు పొడిగించమని కోరడం సరికాదని... గడువు పొడిగించరాదని తాను రాష్ట్రపతిని కోరతానని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ఆగదని చెప్పారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని ఆమోదించాల్సిన అవసరం పార్లమెంటుకు లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతారన్న ప్రచారం నేపథ్యంలో... తన ఇమేజ్ ను పనిగట్టుకుని డ్యామేజ్ చేస్తున్నారని వాపోయారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు అవాస్తవమని చెప్పారు.