: చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి పదేళ్ల జైలు


చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినందుకు ఓ యువకుడికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితురాలి వాంగ్మూలంతో పాటు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. నేరస్తుడు ఉత్తరప్రదేశ్ వాసి సురేందర్ గుప్తా (24)కు ఢిల్లీ కోర్టు జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ఘటన జరిగే నాటికి బాధిత బాలికకు ఏడేళ్లేనని.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష సరైనదేనని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

బాధిత కుటుంబం, గుప్తా ఒకే వీధికి చెందిన వారు. తమ కుమార్తెపై గుప్తా అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి 2012 జనవరి 18న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప ఆడుకుంటుండగా చాక్లెట్ ఇస్తానంటూ మభ్యపెట్టి గుప్తా బయటకు తీసుకెళ్లాడని ఆమె తెలిపారు. చాలా సేపటి వరకు కుమార్తె రాకపోవడంతో తాము ఆమె కోసం గాలించామని, చివరకు గుప్తా ఇంట్లోంచి బాలిక కేకలు వినిపించాయని ఆమె తెలిపారు. జరిగిన ఘోరాన్ని గమనించే లోపే నేరస్తుడు పారిపోయాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు విచారించిన న్యాయస్థానం గుప్తాను దోషిగా నిర్థారించి శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News