: హైదరాబాదులో సమ్మె సైరన్ మోగించిన ఆటో డ్రైవర్లు
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆటో డ్రైవర్లు సమ్మె సైరన్ మోగించారు. కేంద్రప్రభుత్వం ఇష్టానుసారం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుండటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రో ధరలతో బతుకు బండిని లాగడం రోజురోజుకూ కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. పెంచిన ధరలను తగ్గించాలంటూ, అలాగే ఆటో మీటరు ఛార్జీలు పెంచాల్సిందేనంటూ వారు రేపు (శుక్రవారం) అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆటో సంఘాల వారు రవాణా శాఖ కమిషనర్ కు ఇంతకు ముందే సమ్మె నోటీసును ఇచ్చారు. మొత్తం 16 సంఘాల వారు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బషీర్ బాగ్ లో ఆటో డ్రైవర్ల జేఏసీ సమావేశమవుతోంది.