: ఈ ‘పెద్దపులి’.. గిన్నిస్ రికార్డులకెక్కుతోంది


పెద్దపులి కొండలు, గుట్టలు కదా ఎక్కేది.. రికార్డులకెక్కడమేమిటి అనుకుంటున్నారా? అవును.. ఈ బెంగాల్ టైగర్ కాన్పూర్ జూలో నిన్న కన్నుమూసింది, కానీ.. ఎక్కువ కాలం జీవించిన పెద్దపులిగా గిన్నీస్ రికార్డుకెక్కి చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. సాధారణంగా పెద్దపులులు 14-16 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయని, రాయల్ బెంగాల్ జాతికి చెందిన ‘గుడ్డు’ అనే పెద్ద పులి మాత్రం 26 సంవత్సరాలు జీవించిందని కాన్పూర్ జూ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని గిన్నీస్ బుక్ అధికారులకు తెలియజేస్తామని వారు పేర్కొన్నారు. గతంలో ఈ రికార్డు ఫ్లోరిడాకు చెందిన ఫ్లెవియా అనే పులి పేరిట ఉంది. ఆ రికార్డును ఇప్పడీ ‘గుడ్డు’ సొంతం చేసుకోబోతోంది. వయసు పైబడటంతో దంతాలన్నీ కోల్పోయిన ఈ పెద్దపులికి జూ అధికారులు ఎముకల్లేని మాంసం, విటమిన్లను ఆహారంగా అందిస్తున్నారు. అయితే, వారం రోజుల నుంచి పులి ఆహారం తినటం పూర్తిగా మానేసిందని, బుధవారం కన్నుమూసిందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News