: మహారాష్ట్ర మంత్రి సిఫారసు మేరకే వారికి దర్శనం: కనుమూరి బాపిరాజు


దావూద్ అనుచరులకు శ్రీవారి దర్శనం కల్పించారన్న అభియోగాలపై టీటీడీ ఛైర్మన్ స్పందించారు. మహారాష్ట్రకు చెందిన ఒక మంత్రి సిఫారసు లేఖ మేరకే కొందరికి స్వామివారి దర్శనం కల్పించామని తెలిపారు. లేఖలో పేర్లు ఉన్న వారిలో దావూద్ అనుచరులు ఉన్నారో? లేదో? తమకు తెలియదని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారమే నడుచుకున్నాం తప్ప... తెలిసి ఏ తప్పూ చేయలేదని అన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులపై పెట్టిన కేసులను టీటీడీ ఈవో మానవతా దృక్పథంతో వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News