: పుస్తకం రాయబోతున్న లాలూ


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలో ఓ పుస్తకం రాయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. దాణా స్కాంలో ఐదేళ్లు జైలు శిక్ష పడ్డ లాలూ ఇటీవలే బెయిల్ పై విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఎక్స్ పోజింగ్ బిగ్ ఇన్ పాలిటిక్స్' పేరుతో పుస్తకం రాయదల్చుకున్నట్లు చెప్పారు. దాణా కుంభకోణంలో తనపై కుట్రపన్ని కొంతమంది తనను దోషిగా చూపి జైలుకు పంపారన్నారు. అలాంటి కొందరి రాజకీయ నేతలపై తన పుస్తకంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిస్తానన్నారు. అంతేకాక 1974 ఎమర్జెన్సీ సమయంలో జరిగిన విద్యార్థి ఉద్యమంలో తాను పాల్గొన్నానని.. దీనికి సంబంధించి కూడా కొన్ని విషయాలు ఉంటాయన్నారు. తన పుస్తకంలో వాస్తవ కథలను, తన రాజకీయ జీవితంలో ఎత్తు పల్లాలను ప్రస్తావిస్తానన్నారు.

  • Loading...

More Telugu News