: ఇద్దరు ఎస్సైలను చితకబాదిన గ్రామస్తులు
విశాఖపట్టణం జిల్లా యలమంచిలి శివారు ఎర్రవరంలో ఇద్దరు ఎస్సైలపై గ్రామస్తులు దాడిచేశారు. గాయపడిన ఎస్సైలు ఇద్దరూ సీఐకి ఫిర్యాదు చేశారు. అనంతరం దాడిలో పాల్గొన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఎర్రవరంలో కోడిపందాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారం రావడంతో, ఇద్దరు ఎస్సైలు ఎర్రవరం వెళ్లారు. దీంతో స్థానికులు వీరిద్దరిపై దాడి చేశారు.