: అసంతృప్త ఎమ్మెల్యే బిన్నీకి ఆమ్ ఆద్మీ షోకాజ్ నోటీసు
పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల హామీలకు విరుద్ధంగా పాలిస్తున్నారంటూ బహిరంగంగా విమర్శలు చేసిన ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీకి షోకాజ్ నోటీసు జారీ చేస్తామని మరోనేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. క్రమశిక్షణలేమిని క్షమించేది లేదన్నారు. షోకాజు నోటీసు జారీ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై రాజకీయ వ్యవహారాల కమిటీలో నిర్ణయిస్తామని చెప్పారు.