: చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు పోటీలు


చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ఈ పోటీలను తిలకించేందుకు జిల్లావాసులు తండోపతండాలుగా తరలివచ్చారు. రంగంపేటలో ఎద్దు కొమ్ములకు కిరీటాలు కట్టి నిర్వాహకులు వీధుల్లోకి వదిలారు. కిరీటాలు దక్కించుకునేందుకు స్థానికులు పోటీ పడుతున్నారు. కిరీటం కోసం ఎద్దు వెంట పరుగెడుతూ పలువురు యువకులు ఈ జల్లికట్టు ఆటలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News