: విచారణకు రావాలని సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు ఆదేశాలు
1998 నాటి కృష్ణ జింకలను వేటాడిన కేసులో నటుడు సల్మాన్ ఖాన్ ను విచారణకు స్వయంగా హాజరు కావాలని రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకూ కోర్టు విచారణకు హాజరు కాకుండా సల్మాన్ కు మినహాయింపు ఉంది. ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులందరి విచారణ పూర్తి కావడంతో ఇక నిందితుడైన సల్మాన్ తమ ముందు హాజరు కావాలని జోధ్ పూర్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1998 అక్టోబర్ 1 రాత్రి జోధ్ పూర్ సమీపంలోని కంకాని గ్రామంలో కృష్ణజింకలను వేటాడినట్లు.. అందుకు లైసెన్స్ గడువు తీరిన తుపాకీ వినియోగించినట్లు సల్మాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.