: పాక్ ను విడిచి వెళ్లేందుకు నిరాకరించిన ముషారఫ్?
వైద్య కోణాల నేపథ్యంలో పాకిస్థాన్ ను విడిచి వెళ్లేందుకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నిరాకరించారు. తనపై నడుస్తున్న కేసులన్నింటిలో క్లీన్ చిట్ లభించేంతవరకు పాక్ నుంచి వెళ్లబోనని నిర్ణయించుకున్నట్లు ముషారఫ్ సన్నిహితుడొకరు తెలిపారు. దేశద్రోహం కేసులో కొన్ని నెలల నుంచి విచారణ ఎదుర్కొంటున్న ముషారఫ్ కొన్ని రోజుల కిందట గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయనకు యాంజియోప్లాస్టీ చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో చికిత్స కోసం ఆయనను అమెరికా తీసుకు వెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, దీన్ని ముషారఫ్ తిరస్కరిస్తున్నట్లు సమాచారం.