: శాసనసభలో నాలుగవ రోజు అదే పరిస్థితి !
రాష్ట్ర శాసనసభ వాయిదాల మీద వాయిదాల కారణంగా విలువైన సమయం హరించుకుపోతోంది. నాలుగవ రోజు కూడా మునుపటి పరిస్థితే కొనసాగింది. ఈ ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో విపక్షాలు ఇచ్చిన తీర్మానాలను సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. ఇందుకు సభ్యులు నిరసన తెలిపారు.మరోవైపు తెలంగాణ అంశంపై సభలో తీర్మానం పెట్టాలని టీఆర్ఎస్, బీజేపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు.
ఇదే సమయంలో బాబ్లీపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టు బట్టారు. వీటన్నిటి మధ్య సమావేశాలు సజావుగా సాగకపోవడంతో స్పీకర్ సభను గంటపాటు (10 గంటల వరకు) వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది. అయినా ప్రతిపక్ష సభ్యులు తిరిగి తమ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.