: శాశ్వత కోమాలోకి షుమాకర్?


ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్ములా వన్ రేసర్ షుమాకర్ కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన శాశ్వత కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్, జర్మనీ దేశాలకు చెందిన మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తూ పడిపోయిన షూమాకర్ తలకు బలమైన దెబ్బలు తగలడంతో కోమాలోకి వెళ్లాడు. అప్పట్నుంచి అతను ఆసుపత్రిలో కోమాలోనే ఉన్నాడు. షుమాకర్ శాశ్వత కోమాలోకి వెళతాడనే వార్తలతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. షుమాకర్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు ఆయన కుటుంబ సభ్యులు కానీ, మేనేజ్ మెంట్ కానీ ఎలాంటి సమాచారం అందించలేదు.

  • Loading...

More Telugu News