: 576 మంది ప్రభుత్వ ఉద్యోగులపై బీహార్ సీఎం వేటు!
అవినీతి నియంత్రణలో భాగంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేశారు. రెండు నెలల్లోగా 576 మంది అధికారులు, ఉద్యోగులను డిస్ మిస్ చేయాలని నితీశ్ నిన్న(బుధవారం) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్స్ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఓ వారంలో వీరిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఏకే సిన్హా తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేసి, త్వరిత చర్యలు తీసుకోవాలని సీఎం తమకు సూచించారని మీడియాకు చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ జల్ బోర్డులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను బదిలీచేసింది. ఈ ప్రభావంతోనే బీహర్ లో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.