: ఒకేసారి లక్షమంది ఒకే గీతం ఆలపిస్తే..
ఈ అద్భుత సన్నివేశం ఈ నెల 27న ముంబైలోని మహాలక్ష్మి రేస్ కోర్స్ మైదానంలో ఆవిష్కృతం కానుంది. దేశభక్తి గేయమైన ఏ మేరే వతన్ కే లోగో పాటను ఏకకాలంలో లక్షమంది గానం చేయనున్నారు. 1963 జనవరి 27న గాయని లతామంగేష్కర్ దీన్ని ఆలపించారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇలా లక్ష మందితో పాడించే ఏర్పాటును షహీద్ గౌరవ్ సమితి చేసింది. ఇందులో లతామంగేష్కర్ కూడా పాల్గొననున్నారు.