: ఒబామానే చంపేస్తానని బెదిరించి బుక్కయిన మహిళ
'నేను వాషింగ్టన్ డీసీకి వస్తున్నాను నిన్ను చంపడానికి..' ఈ సందేశంతో గతేడాది నవంబర్ 28న ఒక లేఖ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వచ్చింది. రంగంలోకి దిగిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు డినైస్ ఓనీల్ నుంచి లేఖ వచ్చినట్లు గుర్తించారు. గత డిసెంబర్ 26న హ్యూస్టన్ లో ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం నిరూపితమైతే ఐదేళ్ల జైలు శిక్ష, 2.5లక్షల డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆ లేఖలోనే డినైస్ తాను శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. అదే నిజమైతే శిక్ష తగ్గవచ్చు.