: సచిన్ కు థండర్ గాలం..! మాస్టర్ మళ్లీ బ్యాట్ పడతాడా?


అదృష్టం కలిసివస్తే సచిన్ అభిమానులకు మళ్లీ పండగరోజులు రానున్నాయి. మాస్టర్ మళ్లీ బ్యాట్ పట్టి చెలరేగిపోనున్నాడు. అసలు విషయమేమిటంటే, ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ జరగనుంది. బీబీఎల్ ఫ్రాంచైజీ అయిన సిడ్నీ థండర్ తమ జట్టు తరఫున ఆడాలని సచిన్ ను సంప్రదించినట్లు సమాచారం. కానీ మాస్టర్ ఇంకా ఓకే చెప్పినట్లు లేదు. ఎన్నాళ్లుగానో విజయం కోసం వేచి ఉన్న సిడ్నీ థండర్ రాబోయే ట్వంటీ20 టోర్నమెంట్ లో సచిన్ లాంటి ఆటగాళ్లతో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ కు భారీ ప్యాకేజీ ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రముఖ ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఒక వార్తను ప్రచురించింది. థండర్ సచిన్ ను ఒప్పించేందుకు తీవ్ర స్థాయిలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మాస్టర్ ఓకే అంటే మనకు ముచ్చటైన షాట్స్ పండగే!

  • Loading...

More Telugu News