: కేంద్ర మంత్రి శశి థరూర్, భార్య సునంద మధ్య విభేదాలు!
రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న కేంద్ర మంత్రి శశిథరూర్, భార్య సునంద పుష్కర్ మధ్య పొరపొచ్చాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎంతో సాఫీగా సాగిపోతున్న వారి కాపురం విభేదాలకు దారి తీసినట్లు సమాచారం. దాంతో, థరూర్ నుంచి తాను విడాకులు కోరనున్నట్లు భార్య సునంద తెలిపింది. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు వెల్లడించింది. భర్త థరూర్ కు, పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళా జర్నలిస్టుకు వివాహేతర సంబంధం ఉందని చెప్పింది. అందుకని తను తప్పకుండా భర్త నుంచి విడాకులు కోరతానని పేర్కొంది. నిన్న (బుధవారం)సాయంత్రం థరూర్ ట్విట్టర్ అకౌంట్ లో అకస్మాత్తుగా కొన్ని కామెంట్లు పోస్ట్ అయ్యాయి. అందులో పాక్ కు చెందిన మెహర్ తరర్ అనే మహిళా జర్నలిస్టుకు, మంత్రికి సంబంధం ఉన్నట్లు ఉంది. వాటిని చూసిన థరూర్ తన అకౌంట్ ను డిలీట్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరో తన అకౌంట్ ను హ్యాక్ చేశారని వివరించారు. ఆ తర్వాత సునంద పై విధంగా ప్రకటన చేయడం ఆశ్చర్యం.