: అత్తారింట్లో సందడి చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె
కొత్త పెళ్లికూతురైన సినీ హీరో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తన భర్త శ్రీభరత్ తో కలిసి ఎస్.మూలపొలంలోని అత్తారింటికి వచ్చారు. కుటుంబసభ్యులతో కలసి సంక్రాంతి వేడుకలను ఘనంగా చేసుకున్నారు. శ్రీభరత్ మాజీ ఎంపీ, గీతమ్స్ విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుల మనుమడు. కొత్త దంపతులతో గడిపేందుకు కావూరి కూడా మూలపొలం వచ్చారు. అయితే, షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల బాలకృష్ణ రాలేకపోయారు.