: రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం డౌటే


ఏఐసీసీ సమావేశం రేపు జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తారంటూ ఇప్పటివరకు వార్తలు వెలువడ్డాయి. కానీ, ఈ విషయంలో కాంగ్రెస్ వెనుకడుగు వేసినట్లు కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం జరగనున్న వర్కింగ్ కమిటీ సమావేశంలో రేపటి సమావేశపు అజెండాను ఖరారు చేయనున్నారు. రేపటి సమావేశంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటిస్తారని సమాచారం. దాంతోపాటు ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో తుది నిర్ణయాన్ని అధినేత్రి సోనియాకు కట్టబెడుతూ తీర్మానించే అవకాశాలున్నాయంటున్నారు.

  • Loading...

More Telugu News